breaking news
sreevari
-
తిరుమలలో మరో అద్భుత ఘట్టానికి ఏర్పాట్లు
-
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబు
– సిద్దమైన శ్రీవారి పుష్కరిణి – గదులు, ఆర్జిత సేవల ముందస్తు రిజర్వేషన్ రద్దు – సెప్టెంబరు 27న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 3వ తేది నుండి 11వ తేది వరకు నిర్వహించనున్నారు. ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. శ్రీవారి పుష్కరిణి మరమ్మతులు పూర్తి చేసి పైపులతో కొత్త నీటిని నింపే చర్యలు మంగళవారం ప్రారంభించారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లు ఇవి.. – శ్రీవారి ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధుల్లో 2.20 లక్షల మంది భక్తులు వేచిఉండేందుకు వీలుగా గ్యాలరీలు, బ్యారికేడ్లు నిర్మాణం ప్రారంభించారు. గరుడ సేవలో లక్షలాది మంది భక్తులు వాహన సేవను దర్శించేలా అదనపు ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ వీధుల్లో రంగుల రంగువళ్లులు అలంకరించారు. – బ్రహ్మోత్సవాల్లో గదులు, శ్రీవారి ఆర్జిత సేవల ముందస్తు రిజర్వేషన్ రద్దు చేశారు. – ఉత్సవాల్లో అదనంగా సీసీ కెమెరాలు, నిఘా భద్రతా విభాగాలతో భద్రతను పర్యవేక్షించనున్నారు – రోజూ 3 వేల నుండి 3500 మంది పోలీసు భద్రత వినియోగించాలని నిర్ణయించారు. గరుడ సేవ రోజున అదనంగా మరో వెయ్యి మందిని రప్పించనున్నారు. జాతీయ విపత్తుల నివారణ సంస్థ నుంచి మరో 50 మంది సిబ్బంది రానున్నారు. ఉత్సవాల్లో టీటీడీ, విజిలెన్స్, పోలీసు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆక్టోపస్, వంటి ఇతర నిఘా సంస్థలు అనుక్షణం అందుబాటులో ఉండేలా ప్రత్యేక కార్యాచరణ చేశారు. – కాటేజీలు, అతిథిగృహాలను ముందస్తుగానే మాస్క్లీనింగ్ నిర్వహించారు. – ఆలయానికి సరికొత్త శోభతో కాంతులీనే విధంగా విద్యుత్ అలంకరణ ప్రారంభించారు. – అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాల్లో సౌకర్యాలు పెంచనున్నారు. – కల్యాణవేదికలో ఫొటో ఎగ్జిబిషన్, ఫల, పుష్పప్రదర్శన ఏర్పాటుకోసం ప్రణాళికలు సిద్దం చే శారు. – వేలాదిగా తరలివచ్చే వాహనాల కోసం అదనపు పార్కింగ్ కేంద్రాలు, రింగ్‌రోడ్డు సదుపాయం కల్పించనున్నారు. – హిందూ ధర్మప్రచారం, అన్నమాచార్య, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భక్తి, సంగీత, సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. – సెప్టెంబరు 16న పున్నమి గరుడ సేవను బ్రహ్మోత్సవం తరహాలో నిర్వహించి లోపాలు గుర్తించనున్నారు. – సెప్టెంబరు 27న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. అంగరంగవైభవంగా ఉత్సవాలు: టీటీడీ ఈవో శ్రీవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు మంగళవారం విలేకరులకు వెళ్లడించారు. భక్తులకు రోజుకు ఏడు లక్షలు అందుబాటులో ఉండే ఏర్పాట్లు చేశామన్నారు.పారిశుద్ధ్యం మరింత మెరుగుపరుస్తామన్నారు. ఉత్సవాల్లో పచ్చదనం, పుష్పాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ––––––––––––––––––––––––––––––––––– తేది ఉదయం రాత్రి –––––––––––––––––––––––––––––––––– 03–10–2016 –ధ్వజారోహణం( సా:6గం) – పెద్ద శేషవాహనం 04–10–2016 – చిన్నశేషవాహనం – హంసవాహనం 05–10–2016 – సింహవాహనం – ముత్యపుపందిరి వాహనం 06–10–2016 – కల్పవృక్షవాహనం – సర్వభూపాల వాహనం 07–10–2016 – మోహినీ అవతారం– గరుడ వాహనం 08–10–2016 – హనుమంతæవాహనం, సాయంత్రం స్వర్ణ రథోత్సవం – గజవాహనం 09–10–2016 – సూర్యప్రభ వాహనం– చంద్రప్రభ వాహనం 10–10–2016 – రథోత్సవం – అశ్వ వాహనం 11–10–2016 – చక్రస్నానం – ధ్వజ అవరోహణం -
శ్రీవారి ఆర్జిత సేవల లక్కిడిప్ ఆగస్టు కోటా విడుదల
సాక్షి,తిరుమల: తిరుమలలో లక్కీడిప్ కింద కేటాయించే శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు కోటా శనివారం టీటీడీ ప్రజా సంబంధాల విభాగం విడుదల చేసింది. శ్రీవారి ఆర్జిత సేవలకు ముందురోజు సాయంత్రం 5 గంటల్లోగా కేంద్రీయ విచారణ కార్యాలయం (సీఆర్వో)లోని విజయాబ్యాంక్ కౌంటర్లో లక్కీడిప్ ద్వారా టికెట్లు కేటాయిస్తారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5గంటల వరకు భక్తులు తమ వ్యక్తిగత వివరాలు, వేలిముద్రలు, సెల్ నెంబర్ కంప్యూటర్లో నమోదు చేసుకుని టోకెన్ పొందాలి. నమోదు చేసుకున్న వారిలో కంప్యూటర్ ర్యాండమ్ పద్ధతిలో అందుబాటులో ఉన్న ఆర్జిత సేవాటికెట్లు కేటాయిస్తారు. తర్వాత ఎంపికైన భక్తుల సెల్ నెంబరుకు ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం అందజేస్తారు. రాత్రి 8 గంటల్లోపు భక్తులు ఆ టికెట్టు కొనుగోలు చేయాలి. శుక్రవారం నిర్వహించే పురాభిషేకం, మేల్చాట్ వస్త్రం టికెట్లను రెండో విడత లక్కీడిప్‌లో కేటాయిస్తారు. వీటిని రాత్రి 10 గంటల్లోపు భక్తులు పొందవచ్చు. సామాన్య భక్తులు కూడా లక్కీడిప్ ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ అరుదైన ఆర్జిత సేవల్లో పాల్గొని స్వామివారి దివ్య మంగళరూపాన్ని దర్శించుకుని ఆనంద పరవశులవుతున్నారు. ఆగస్టు లక్కీడిప్ కోటా వివరాలు తోమాల అర్చన వస్త్రం పూరాభిషేకం 02.08.2016 06 17 – – 03.08.2016 07 15 – – 04.08.2016 07 26 – – 05.08.2016 – – 01 35 09.08.2016 06 12 – – 10.08.2016 05 18 – – 11.08.2016 – 09 – – 12.08.2016 – – 02 – 16.08.2016 పవిత్రోత్సవం సందర్భంగా రద్దు 17.08.2016 – 31 – – 18.08.2016 – – – – 19.08.2016 – – 02 – 23.08.2016 – 06 – – 24.08.2016 – – – – 25.08.2016 – 17 – – 26.08.2016 – – 01 – 30.08.2016 – – – – 31.08.2016 – 45 – – -
నేటి నుంచి శ్రీవారి మెట్లోత్సవాలు
నేటి నుంచి శ్రీవారి మెట్లోత్సవాలు నేటి నుంచి, శ్రీవారి, మెట్లోత్సవం, today, sreevari, metlothsvam తిరుపతి కల్చరల్: మంత్రాలయ శ్రీగురుసార్వభౌమ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి మెట్లోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ అబ్బన్నాచార్యులు తెలిపారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. ఆధ్యాత్మిక ప్రచారంతో భక్తితత్వాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు సుమారు వెయ్యి మంది భజన మండళ్లతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మొదటి సారిగా ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శ్రీవారి మెట్లోత్సవం చేపడుతున్నామని తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి మహతి కళాక్షేత్రంలో నగర సంకీర్తన, సామూహిక భజనలు నిర్వహిస్తామన్నారు. మంగళవారం వేకువజామున భజన మండళ్ల సంకీర్తనలతో అలిపిరి పాదాల మండపం నుంచి మెట్లోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. బుధవారం తిరుపతిలోని మూడో సత్రంలో సుప్రభాతం, జ్ఞాన, యోగ కార్యక్రమాలతో పాటు భజన మండళ్లకు సంకీర్తనల పోటీలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠం మేనేజర్ రాఘవేంద్రరావు, కె.వాదిరాజు పాల్గొన్నారు.