నేటి నుంచి శ్రీవారి మెట్లోత్సవాలు | netinunchi srivari metlothsavam | Sakshi
Sakshi News home page

నేటి నుంచి శ్రీవారి మెట్లోత్సవాలు

Jul 24 2016 9:58 PM | Updated on Sep 4 2017 6:04 AM

మంత్రాలయ శ్రీగురుసార్వభౌమ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి మెట్లోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్‌ అబ్బన్నాచార్యులు తెలిపారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు.

నేటి నుంచి శ్రీవారి మెట్లోత్సవాలు
నేటి నుంచి, శ్రీవారి, మెట్లోత్సవం, today, sreevari, metlothsvam
తిరుపతి కల్చరల్‌: మంత్రాలయ శ్రీగురుసార్వభౌమ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి మెట్లోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్‌ అబ్బన్నాచార్యులు తెలిపారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. ఆధ్యాత్మిక ప్రచారంతో భక్తితత్వాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు సుమారు వెయ్యి మంది భజన మండళ్లతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మొదటి సారిగా ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో శ్రీవారి మెట్లోత్సవం చేపడుతున్నామని తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి మహతి కళాక్షేత్రంలో నగర సంకీర్తన, సామూహిక భజనలు నిర్వహిస్తామన్నారు. మంగళవారం వేకువజామున భజన మండళ్ల సంకీర్తనలతో అలిపిరి పాదాల మండపం నుంచి మెట్లోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. బుధవారం తిరుపతిలోని మూడో సత్రంలో సుప్రభాతం, జ్ఞాన, యోగ కార్యక్రమాలతో పాటు భజన మండళ్లకు సంకీర్తనల పోటీలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠం  మేనేజర్‌ రాఘవేంద్రరావు, కె.వాదిరాజు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement