అత్తకు యముడు... | Attan son's murder | Sakshi
Sakshi News home page

అత్తకు యముడు...

Nov 29 2016 1:27 AM | Updated on Sep 2 2018 4:37 PM

వంట తెచ్చిన తంటా అల్లుడి చేతిలో అత్తను హత్యగావించింది. వంట రుచిగా లేదంటూ శివాలెత్తిపోయిన అల్లుడు.. అత్తను గొంతు నులిమి చంపేశాడు. తల్లిని రక్షించాల్సిన కూతురు మొగుడే ముఖ్యమనుకుని ఈ హత్యకు సహకరించింది.

బెంగళూరు (కేఆర్‌ పురం)  :
చికెన్ రుచిగా వండలేదనే కారణంతో సొంత అత్తను అల్లుడు హత్య చేసిన సంఘటన ఆవలహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు... అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన వీరప్ప కృష్ణరాజపురంలోని కేఆర్‌ ఇఎస్ హోటల్‌లో సూపర్‌వైజర్‌ పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం ఇతను కిత్తగనూరుకు చెందిన మునిరత్నమ్మ (50) కుమార్తె సౌమ్యను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అత్త ఇంటిలోనే నివాసం ఉంటున్నాడు. ఇదిలా ఉంటే మద్యానికి బానిసైన వీరప్ప నిత్యం తాగి వచ్చి అత్తతో గొడవకు దిగేవాడు.
 ఆదివారం చికెన్ సరిగా వండలేదని అత్తతో గొడవకు దిగాడు. ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని సర్ది చెప్పి పంపారు. దీంతో అల్లుడిని బయటే ఉంచి వాకిలి వేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఇంటి పొగ గొట్టం నుంచి లోనికి దిగిన వీరప్ప తన భార్య  సౌమ్య సహాయంతో అత్త మునిరత్నమ్మ గొంతునులిమి హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement