ఇళ్లపై దాడి | attack on houses | Sakshi
Sakshi News home page

ఇళ్లపై దాడి

Sep 8 2016 12:23 AM | Updated on Sep 4 2017 12:33 PM

ఇళ్లపై దాడి

ఇళ్లపై దాడి

అమనగల్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతికి తమ కులస్తులే కారణమని పలువురు తమ ఇష్టం వచ్చినట్లు దాడి చేసి ఆస్తి నష్టం చేశారని ఎరుకల కులస్తులు కూజ అనిత, వెంకటమ్మ, మంగమ్మ, చంద్ర మ్మ, చిన్న మంగమ్మ బుధవారం తెలిపారు.

మహబూబాబాద్‌ రూరల్‌ : అమనగల్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతికి తమ కులస్తులే కారణమని పలువురు తమ ఇష్టం వచ్చినట్లు దాడి చేసి ఆస్తి నష్టం చేశారని ఎరుకల కులస్తులు కూజ అనిత, వెంకటమ్మ, మంగమ్మ, చంద్ర మ్మ, చిన్న మంగమ్మ బుధవారం తెలిపారు. మహబూబాబాద్‌ మండలంలోని అమనగల్‌ గ్రామానికి చెందిన గీత కార్మికుడు పూజారి వీరన్న ఆగస్టు 12న గ్రామ శివారులో ద్విచక్ర వాహనం ఢీకొని గాయపడి చికిత్సపొందుతూ అదే నెల 25న మృతిచెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించి ఎరుకల కులానికి చెందిన వ్యక్తి కారణమంటూ ఆమనగల్‌కు చెందిన బొమ్మెర రామస్వామి 40 మందిని వెంటబెట్టుకుని వచ్చి తమ కులానికి చెందిన ఎనిమిది ఇళ్లపై దాడులు చేశారన్నారు. ఈ దాడుల్లో తమ ఇళ్ల ధ్వంసమయ్యాయని, బియ్యం, సామాన్లు, బీరువాలు, టీవీలు, ఫర్నీచర్‌ పనికి రాకుండా పగులగొట్టారని వాపోయారు. తమ కుటుంబ సభ్యులపై కూడా బూతులు తిడుతూ దాడి చేశారన్నారు. పూజారి వీరన్న మృతికి తమ కులస్తులే కారణమంటూ ఇష్టం వచ్చినట్లు దాడి చేయడంతో భయాందోళనకు గురై అమనగల్‌ విడిచి పారి పోయి మహబూబాబాద్‌కు వచ్చి రూరల్‌ పోలీస్‌స్టేçÙన్‌లో ఫిర్యాదుచేశామన్నారు. రూరల్‌ ఏఎస్సై  రాజేందర్, హెడ్‌కానిస్టేబుల్‌ డీ.మనోహరస్వామి, పోలీసు సిబ్బంది అమనగల్‌లోని ఎరుకల కులస్తుల ఇళ్లు ధ్వంసమైన ప్రాంతాలను పరిశీలించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement