సమాజంలో కొంతమంది తమ స్వార్థం కోసం యువతను మభ్యపెడుతున్నారని, వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సూచించారు.
మహబూబ్‌నగర్: సమాజంలో కొంతమంది తమ స్వార్థం కోసం యువతను మభ్యపెడుతున్నారని, వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సూచించారు. యువత పెడదోవ పట్టకుండా దైవభక్తితో సన్మారంలో నడవాలని పిలుపునిచ్చారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ జామీయామసీద్‌లో నిర్మించిన ప్రధానద్వారం(బాబుద్‌దాఖ్‌ల)ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మసీదు ఆవరణలో ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించారు. కంప్యూటర్ ద్వారా ఇస్లాంను నేర్చుకోలేరని, మతపెద్దలు దగ్గరికి వెళ్లి నేర్చుకుంటే వస్తుందన్నారు. రంజాన్ తరువాత ప్రతిఒక్క ముస్లిం ఐదుపూటలా నమాజుచేయాలని కోరారు. తమ సంపాదనలో సమాజసేవకు వినియోగించాలని సూచించారు.