ప్రొ.కోదండరాం అర్రెస్ట్‌ అప్రజాస్వామికం | Arrest prokodandaram aprajasvamikam | Sakshi
Sakshi News home page

ప్రొ.కోదండరాం అర్రెస్ట్‌ అప్రజాస్వామికం

Jul 25 2016 8:10 PM | Updated on Sep 4 2017 6:14 AM

పోలీసులు దాడి చేసిన మల్లన్న సాగర్‌ భూ నిర్వాసితులను పరామర్శించడానికి వెల్లనీయకుండా జెఎసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాంను అర్రెస్టు చేయడం అప్రజాస్వామికమని జెఎసి నాయకులు అశోక్‌ కుమార్, బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బీరయ్య యాదవ్‌లు మండిపడ్డారు.

 ఖండించిన జెఎసి
సంగారెడ్డి టౌన్ః
పోలీసులు దాడి చేసిన మల్లన్న సాగర్‌ భూ నిర్వాసితులను పరామర్శించడానికి వెల్లనీయకుండా జెఎసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాంను అర్రెస్టు చేయడం అప్రజాస్వామికమని జెఎసి నాయకులు అశోక్‌ కుమార్, బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బీరయ్య యాదవ్‌లు మండిపడ్డారు. ‍‍ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

నీటిపారుదల ప్రాజెక్టు నిపుణులు అక్కడ 50 టిఎంసిల ప్రాజెక్టు అవసరం లేదని చెబుతున్నారని, అయితే ప్రభుత్వ బలవంతంగా భూసేకరణ ఎందుకు చేస్తున్నారని వారు ప్రశ్నించారు. కార్పోరేట్‌ శక్తులకు భూములు అప్పగించేందుకే ప్రభుత్వ భూములను బలవంతంగా గుంజుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల మాదిరిగానే ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతులపై దాడులు దేనికి సంకేతమని నిలదీశారు. రైతులకు, ప్రజలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్ఛరించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement