తిరుమల శ్రీవారి ఆలయంలో మే నెలలో జరిగే వివిధ ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లను అందుబాటులోకి రానున్నాయి.
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో మే నెలలో జరిగే వివిధ ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లను అందుబాటులోకి రానున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్‌లో www. ttd sevaonline. com వెబ్‌సైట్ ద్వారా ముందస్తుగా రిజర్వు చేసుకోవచ్చు.
తిరుమలలో ప్రతి నెలా మొదటి శుక్రవారం నిర్వహించే డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమం ఏప్రిల్ 1వ తేదీ శుక్రవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ పరిధిలో ఎదురయ్యే సమస్యలు, సూచనలపై భక్తులు 0877-2263261 నెంబరుకు ఫోన్ చేసి నేరుగా టీటీడీ ఈవో డాక్టర్ డి.సాంబశివరావుకు తెలియజేయవచ్చు.