ప్రభుత్వ విప్ ఓదేలు నివాసం వద్ద మిస్ ఫైర్ | AR constable dies in gun misfire | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ విప్ ఓదేలు నివాసం వద్ద మిస్ ఫైర్

May 14 2016 1:03 PM | Updated on Apr 8 2019 8:33 PM

ప్రభుత్వ విప్ ఓదేలు నివాసం వద్ద మిస్ ఫైర్ - Sakshi

ప్రభుత్వ విప్ ఓదేలు నివాసం వద్ద మిస్ ఫైర్

న్నూరు ఎమ్మెల్యే, తెలంగాణ ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు నివాసం వద్ద శనివారం మిస్ ఫైర్ చోటుచేసుకుంది.

ఆదిలాబాద్ : చెన్నూరు ఎమ్మెల్యే, తెలంగాణ ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు నివాసం వద్ద శనివారం మిస్ ఫైర్ చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ గన్ పేలడంతో ఏఆర్ కానిస్టేబుల్ గంగాధర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలోని ఓదేలు ఇంటి వద్ద ఈరోజు మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. కానిస్టేబుల్ గంగాధర్ను చికిత్స నిమిత్తం సింగరేణి ప్రభుత్వ  ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.

 

Advertisement
 
Advertisement
Advertisement