ఏపీలో పీవీ సింధు, గోపిచంద్‌కు ఘనస్వాగతం | AP to grand welcome to PV sindhu, Gopichand at Gannavaram airport | Sakshi
Sakshi News home page

ఏపీలో పీవీ సింధు, గోపిచంద్‌కు ఘనస్వాగతం

Aug 23 2016 10:56 AM | Updated on Sep 4 2017 10:33 AM

ఏపీలో పీవీ సింధు, గోపిచంద్‌కు ఘనస్వాగతం

ఏపీలో పీవీ సింధు, గోపిచంద్‌కు ఘనస్వాగతం

గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న పీవీ సింధు, గోపిచంద్‌కు ఏపీ మంత్రులు ఘనస్వాగతం పలికారు.

కృష్ణా: రియో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్‌లో రజత పతకం సాధించి హైదరాబాద్ నగరంలో అపూర్వ స్వాగతం అందుకున్న పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే స్థాయిలో ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్‌ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న పీవీ సింధు, గోపిచంద్‌కు ఏపీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటిపుల్లారావు, నారాయణ, ఎంపీలు మురళీమోహన్‌, కేశినేని నాని, విద్యార్థులు, పలువురు ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. గన్నవరం నుంచి ప్రారంభమైన విజయోత్సవ ర్యాలీ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం వరకు నిర్వహించనున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి రెండు కిలోమీటర్ల మేర పొడువైన జాతీయ పతాకంతో పీవీ సింధుకు స్వాగతం పలికేందుకు చిన్నారులు బారులు తీరారు.

ఈ నేపథ్యంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ర్యాలీ సందర్భంగా విజయవాడలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. విజయోత్సవ ర్యాలీ అనంతరం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సింధును సన్మానించనున్నారు. అందులోనూ ఈ రోజు కృష్ణా పుష్కరాలు ముగియనుండటంతో సాయంత్రం కృష్ణా హారతి కార్యక్రమానికి పీవీ సింధు హాజరుకానుంది.

Advertisement
 
Advertisement
Advertisement