నేడు తుది విడత ఏపీ మెడికల్ కౌన్సెలింగ్ | AP Medical counselling Today | Sakshi
Sakshi News home page

నేడు తుది విడత ఏపీ మెడికల్ కౌన్సెలింగ్

Sep 28 2015 10:17 AM | Updated on Mar 23 2019 8:59 PM

ఏపీ మెడికల్ కౌన్సెలింగ్‌లో భాగంగా సోమవారం జరిగే తుది విడత కౌన్సెలింగ్ చివరి రోజుకు ఏయూ పరిధిలోని ఎస్టీ కేటగిరీ మహిళా అభ్యర్థులకు...

విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): ఏపీ మెడికల్ కౌన్సెలింగ్‌లో భాగంగా సోమవారం జరిగే తుది విడత కౌన్సెలింగ్ చివరి రోజుకు ఏయూ పరిధిలోని ఎస్టీ కేటగిరీ మహిళా అభ్యర్థులకు మాత్రమే ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయని ఆదివారమిక్కడ హెల్త్ వర్సిటీ క్యాంపు అధికారి డాక్టర్ టి.మురళీమోహన్ తెలిపారు.

ఏయూ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ-సీ అభ్యర్థులకు మాత్రమే బీడీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. సోమవారం జరిగే కౌన్సెలింగ్‌కు 15,001 నుంచి చివరి ర్యాంకు వరకు అభ్యర్థులను ఆహ్వానించారు. ఈ నెల 29వ తేదీ ఉదయం 9 గంటలకు హెల్త్ వర్సిటీలో ఎంసెట్-ఏపీ (పైవేటు కళాశాలల యాజమాన్య కోటా ఎంట్రన్స్)లో అర్హత సాధించిన అభ్యర్థులకు రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement