రోడ్లు ఊడ్చి ఏఎన్‌ఎంల నిరసన | ANM protest with Roads Sweap | Sakshi
Sakshi News home page

రోడ్లు ఊడ్చి ఏఎన్‌ఎంల నిరసన

Jul 23 2016 10:49 PM | Updated on Aug 30 2018 4:51 PM

రోడ్లు ఊడుస్తున్న ఏఎన్‌ఎంలు - Sakshi

రోడ్లు ఊడుస్తున్న ఏఎన్‌ఎంలు

మహబూబ్‌నగర్‌ క్రైం : రాష్ట్రవ్యాప్తంగా పని చేస్తున్న 4వేలమంది రెండో ఏఎన్‌ఎంలను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం రోడ్లు ఊడుస్తూ నిరసన తెలిపారు.

మహబూబ్‌నగర్‌ క్రైం : రాష్ట్రవ్యాప్తంగా పని చేస్తున్న 4వేలమంది రెండో ఏఎన్‌ఎంలను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం రోడ్లు ఊడుస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పర్వతాలు, విజయవర్ధన్‌ రాజు మాట్లాడుతూ  కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న ఏఎన్‌ఎంలను గుర్తించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. 2వ ఏఎన్‌ఎంలను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపం ఎదుట నిర్వహించిన సమ్మె, శనివారం నాటికి ఆరో రోజుకు చేరింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఏఎన్‌ఎంలకు 10వ పీఆర్‌సీ ప్రకారం కనీస వేతనాలు అమలుచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రమేష్, చంద్రకాంత్, భాగ్యవతి, రాజేశ్వరి, మంజుల, కల్పన, వరలక్ష్మి, పుష్ప, సువర్ణ, లత, గొవిందమ్మ, సుమిత్ర పాల్గొన్నారు. 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement