చరిత్రకు చెదలు | Sakshi
Sakshi News home page

చరిత్రకు చెదలు

Published Sun, Jul 17 2016 9:52 PM

అధ్వానంగా సంగమేశ్వరస్వామి ఆలయం.

ఎప్పటిది...
 
ద్వాపర యుగంలో బలరాముడు ప్రతిష్టించిన పంచలింగాల్లో ఒకటి వంగర మండలం సంగాంలోని సంగమేశ్వర లింగం. జిల్లాలోని ప్రాచీన దేవాలయాల్లో సంగమేశ్వర ఆలయం కూడా ఒకటి.
సమస్యలు....
 
ఆలయం వద్ద తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. రక్షిత మంచినీటి పథకం ఉన్నప్పటికీ కుళాయిలు, ట్యాప్‌లు పనిచేయకపోవడంతో ఇక్కడకు వచ్చిన భక్తులు తాగునీటికి ఇక్కట్లు పడుతున్నారు. ఆలయ ప్రాంగణమంతా అధ్వానంగా తయారైంది. పిచ్చిమొక్కలతో దర్శనమిస్తోంది. ఆలయ శిఖరంపై మొక్కలు దర్శనమిస్తున్నా వీటిని తొలగించడానికి అధికారులు శ్రద్ధ చూపడం లేదు. ఆలయ ప్రాంగణం, ఆలయ గర్భంలో బల్బులు పాడైనా వీటిని తిరిగి అమర్చలేదు. ఆలయ సిబ్బంది, పోలీసులు విశ్రాంతి భవనం పూర్తిగా మరమ్మతులకు గురైనా దేవాదాయ శాఖ అధికారులు ఇంత వరకు పట్టించుకోలేదు. 
ఆదాయం– అభివృద్ధి మాట...
 
జిల్లాలో ప్రఖ్యాతి గాంచిన సంగమేశ్వరస్వామి ఆలయంపై అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. కార్తీకమాసం, మహాశివరాత్రి సందర్భాల్లో లక్షలాది రూపాయలు ఆదాయం వస్తూనే ఉంది. ఆ సమయాల్లోనే ఖర్చులు చూపించడంతో ఏడాది పొడువున సంగమేశ్వర స్వామి ఆలయంలో సమస్యలు పేరుకుపోతున్నాయి. ఈ విషయంపై ఈఓ కుమారస్వామి వద్ద సాక్షి ప్రస్తావించగా నిధులు మంజూరు కాకపోవడంతో అభివృద్ధి చేయలేకపోతున్నామని తెలిపారు.
 
– సంగాం(వంగర) 
 
 
 
 
 

Advertisement
Advertisement