ఆరోపణలు తగదు
సీఎస్‌ఐ ట్రస్టు అసోసియేషన్ స్టేక్ హోల్డర్స్ కమిటీ సభ్యులు తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని నంద్యాల డయాసిస్ బిషప్ పుష్పలలిత అన్నారు.
– బిషప్ పుష్పలలిత
నంద్యాలవిద్య : సీఎస్‌ఐ ట్రస్టు అసోసియేషన్ స్టేక్ హోల్డర్స్ కమిటీ సభ్యులు తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని నంద్యాల డయాసిస్ బిషప్ పుష్పలలిత అన్నారు. మంగళవారం చర్చి ఆఫ్ సౌత్ ఇండియా నంద్యాల డయాసిస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వ్యక్తిగత కారణాలచేత తనపై కక్ష సాధించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. తన పరిపాలనలో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగలేదని.. ‘పరిశుద్ధ సిలువపై ఒట్టేసి చెబుతున్నా..నేను ఎలాంటి పాపంచేయలేదు’ అంటూ స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు చేసున్నవారు గతంలో డయాసిస్ పెద్దలపై దుర్భాషలాడారని, వారిపై క్రమశిక్షణ రాహిత్య చర్యలు తీసుకున్నానేతప్ప ఎటువంటి కక్షసాధింపు చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. సమావేశంలో వైస్ ప్రసిడెంట్ రెవరెండ్ ఏసురత్నం, సెక్రటరీ గంగు ఆనంద్, కోశాధికారి రత్నరాజు, గురువులు పాల్గొన్నారు.