భార్య కోసం రష్యా నుంచి.. | akex came from russia for his wife | Sakshi
Sakshi News home page

భార్య కోసం రష్యా నుంచి..

Nov 30 2016 11:34 PM | Updated on Sep 4 2017 9:32 PM

భార్యతో కుమారుడితో కలిసి ఫొటో దిగిన అలెక్స్(ఫైల్)

భార్యతో కుమారుడితో కలిసి ఫొటో దిగిన అలెక్స్(ఫైల్)

భార్యను వెతుక్కుంటూ నగరానికి వచ్చిన ఓ విదేశీయుడికి తీవ్ర నిరాశ మిగిలింది.

అల్వాల్‌: భార్యను వెతుక్కుంటూ నగరానికి వచ్చిన ఓ విదేశీయుడికి తీవ్ర నిరాశ మిగిలింది. ప్రేమించి, పెళ్లి చేసుకున్న భార్య స్వదేశంలోని పుట్టింటికని మూడు నెలల క్రితం రష్యా నుంచి వచ్చింది. ఆమె నుంచి మూడు నెలలుగా ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళనకు గురైన భర్త నేరుగా అల్వాల్‌కు వచ్చాడు. అయితే, ఆమె ఆచూకీ లభించలేదు... బాధితుడి కథనం ప్రకారం.....

రష్యాలో ఉండే అలెక్స్‌ కొన్నేళ్ల క్రితం పని నిమిత్తం గోవాకు వచ్చాడు. అదే సమయంలో అల్వాల్‌కు చెందిన సనమ్‌ కూడా గోవా వెళ్లింది. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి  ప్రేమకు దారి తీసింది. 2014లో ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు.  అనంతరం అలెక్స్‌ భార్య సనమ్‌ను రష్యాకు తీసుకెళ్లాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.

కాగా..  మూడు నెలల క్రితం భార్య సనమ్‌ అల్వాల్‌లోని పుట్టింటికి వచ్చింది. అప్పటి నుంచి అలెక్స్‌ భార్య సనమ్‌కు ఫోన్ చేస్తే ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో అలెక్స్‌ రష్యా నుంచి బుధవారం అల్వాల్‌కు వచ్చి సనమ్‌ ఇంటికి వెళ్లాడు. సనమ్‌ ఉండే ఇల్లు అద్దెది కావడంతో అక్కడి నుండి ఖాళీ చేసి వెళ్లిపోయినట్టు తెలిసింది. దీంతో ఆమె కోసం అలెక్స్‌ అన్ని చోట్లా వెతికినా ఆచూకీ లభించలేదు. 

Advertisement
 
Advertisement
Advertisement