breaking news
sanam
-
Sanam Ratansi: 'సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్'గా పాపులర్..
సోనాక్షీ సిన్హా తన పెళ్లితో టాక్ ఆఫ్ ద సోషల్ మీడియా అయింది. అంతకుముందు నుంచే సనమ్ రతన్సీ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అయింది సోనాక్షీ సిన్హా వెన్నంటే ఉంటూ! ఎందుకంటే సనమ్.. సోనాక్షీ పర్సనల్ స్టయిలిస్ట్! అంతేకాదు ఆమెకు సోనాక్షీతో మరో పర్సనల్ రిలేషన్ కూడా ఉంది. ఆమె.. సోనాక్షీ సిన్హా ఆడపడచు! ఇక్కడ మాత్రం సనమ్ పరిచయం స్టార్ స్టయిలిస్ట్గానే!ఎడిటోరియల్ స్టయిలింగ్, సెలబ్రిటీ స్టయిలింగ్ రెండూ వేటికవే ప్రత్యేకం. అయితే ఎడిటోరియల్ స్టయిలింగ్ కొంచెం కూల్. సెలబ్రిటీ స్టయిలింగ్ కాస్త స్ట్రెస్ఫుల్! కానీ చాలెంజింగ్‌గా ఉంటుంది. కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. నేను స్టయిలింగ్ చేసే సెలబ్రిటీల్లో నాకు అదితీ రావ్ హైదరీ అంటే ఇష్టం. నా పని మీద ఆమెకు నమ్మకం ఎక్కువ.నేనేది చెప్పినా ఆమె లుక్స్‌ని ఎన్హాన్స్ చేయడానికే చెబుతానని ఆమెకు తెలుసు. అందుకే నేను ఏ కాస్ట్యూమ్ తెచ్చినా ట్రై చేస్తుంది. స్టయిలింగ్ రంగంలోకి రావాలనుకునే వారికి ఒకటే సలహా.. కొత్త కొత్త ట్రెండ్స్‌ని గమనిస్తూండాలి. మంచి స్టయిలిస్ట్‌ల దగ్గర ట్రైన్ అవ్వాలి. వాళ్ల వర్క్‌తో ఇన్స్పైర్ అవ్వాలి. నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. ప్రయోగాలకు వెనుకాడకూడదు! – సనమ్ రతన్సీసనమ్.. క్రియేటివ్ జీన్‌తో సంపన్న కుంటుంబంలో పుట్టిపెరిగింది. ఆమె తండ్రి.. ఇక్బాల్ రతన్సీ స్వర్ణకారుడు. రియల్ ఎస్టేట్ వ్యాపారి. క్రియేటివ్ జీన్‌ని తండ్రి నుంచే పొంది ఉంటుంది సనమ్. ఆమెకు ఊహ తెలిసేనాటికే ఫ్యాషన్ పట్ల ఆసక్తి పెంచుకుంది. అందుకే స్కూల్‌కి వెళ్లే వయసులోనే నిశ్చయించుకుంది పెద్దయ్యాక తను ఫ్యాషన్ డిజైనర్ కావాలని! అనుకున్నట్టుగానే ఫ్యాషన్ రంగంలోనే గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. చదువయ్యాక ఫ్యాషన్ మ్యాగజైన్స్‌లో పనిచేసింది.ఆ సమయంలోనే ఒక ఫ్రెండ్ ద్వారా అప్పటికే సెలబ్రిటీ స్టయిలిస్ట్‌గా పాపులర్ అయిన అనాయితా ష్రాఫ్‌ని కలసింది. ఆమెతో సంభాషణ సనమ్‌లో స్టయిలింగ్ పట్ల ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసింది. అప్పుడు అనాయితా ఒక బ్రాండ్ అడ్వర్టయిజ్మెంట్ కోసం దీపికా పదుకోణ్‌కి స్టయిలింగ్ చేస్తోంది. ఆ షూటింగ్ విరామంలోనే అనాయితాను సనమ్ కలసింది. స్టయిలింగ్ పట్ల సనమ్ చూపిస్తున్న ఉత్సుకతను గుర్తించిన అనాయితా ఆ షూటింగ్లో తన పనిని గమనించమని సనమ్‌కి చెప్పింది.షూటింగ్ పూర్తయ్యాక అడిగింది ‘స్టిల్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టయిలింగ్?’ అని! ‘ఎస్.. వెరీమచ్!’ అని బదులిచ్చింది సనమ్. ‘అయితే నా దగ్గర జాయినై పో.. రేపటి నుంచే వచ్చేసెయ్’ అంటూ తన కంపెనీ ‘స్టయిల్ సెల్’లో సనమ్‌కి జాబ్ కన్ఫర్మ్ చేసింది అనాయితా. తెల్లవారి నుంచే ‘రా–వన్’ షూటింగ్‌కి బయలుదేరింది సనమ్.. అనాయితాకు అసిస్టెంట్‌గా! ఆ సినిమా హీరో షారుఖ్ ఖాన్‌కి అనాయితా స్టయిలింగ్ చేస్తోందప్పుడు.ఆ ప్రాజెక్ట్ తర్వాత అవకాశాల కోసం వెదుక్కోవలసిన అవసరం లేకపోయింది సనమ్‌కి. ఇంకెవరి రికమండేషన్ పనీ పడలేదు. సెలబ్రిటీ ఇండివిడ్యువల్ పర్సనాలిటీని హైలైట్ చేసే ఆమె వర్క్ స్టయిల్ ఎంతోమంది స్టార్స్‌కి నచ్చింది. సైఫ్ అలీ ఖాన్, అదితీ రావ్ హైదరీ, హుమా ఖురేషీ, రాజ్‌కుమార్ రావు, మనీషా కోయిరాలా, జహీర్ ఇక్బాల్, అలయా ఎఫ్, రియా చక్రవర్తి, కత్రినా కైఫ్‌లాంటి వాళ్లెందరో కోరి మరీ సనమ్‌ను తమ పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకున్నారు. ఫితూర్, ద గర్ల్ ఆన్ ద ట్రైన్, మలాల్ వంటి సినిమాలకూ పనిచేసింది. తన కీర్తిని పెంచుకుంది. -
భార్య కోసం రష్యా నుంచి..
అల్వాల్: భార్యను వెతుక్కుంటూ నగరానికి వచ్చిన ఓ విదేశీయుడికి తీవ్ర నిరాశ మిగిలింది. ప్రేమించి, పెళ్లి చేసుకున్న భార్య స్వదేశంలోని పుట్టింటికని మూడు నెలల క్రితం రష్యా నుంచి వచ్చింది. ఆమె నుంచి మూడు నెలలుగా ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళనకు గురైన భర్త నేరుగా అల్వాల్‌కు వచ్చాడు. అయితే, ఆమె ఆచూకీ లభించలేదు... బాధితుడి కథనం ప్రకారం..... రష్యాలో ఉండే అలెక్స్ కొన్నేళ్ల క్రితం పని నిమిత్తం గోవాకు వచ్చాడు. అదే సమయంలో అల్వాల్‌కు చెందిన సనమ్ కూడా గోవా వెళ్లింది. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. 2014లో ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం అలెక్స్ భార్య సనమ్‌ను రష్యాకు తీసుకెళ్లాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. కాగా.. మూడు నెలల క్రితం భార్య సనమ్ అల్వాల్‌లోని పుట్టింటికి వచ్చింది. అప్పటి నుంచి అలెక్స్ భార్య సనమ్కు ఫోన్ చేస్తే ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో అలెక్స్ రష్యా నుంచి బుధవారం అల్వాల్‌కు వచ్చి సనమ్ ఇంటికి వెళ్లాడు. సనమ్ ఉండే ఇల్లు అద్దెది కావడంతో అక్కడి నుండి ఖాళీ చేసి వెళ్లిపోయినట్టు తెలిసింది. దీంతో ఆమె కోసం అలెక్స్ అన్ని చోట్లా వెతికినా ఆచూకీ లభించలేదు. -
రెండో రౌండ్లో విష్ణు
పుణే: కేపీఐటీ-ఎమ్‌ఎస్‌ఎల్‌టీఏ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ శుభారంభం చేశాడు. సోమవారం మొదలైన ఈ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో విష్ణు 7-6 (7/2), 6-4తో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాజా వినాయక్ శర్మను ఓడించాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత ప్లేయర్ సనమ్ సింగ్ నాలుగు మ్యాచ్ పారుుంట్లను వదులుకొని ఓటమి పాలయ్యాడు. ఏడో సీడ్ దిమిత్రీ పోప్కో (కజకిస్తాన్) తో జరిగిన మ్యాచ్‌లో సనమ్ 6-3, 6-7 (6/8), 6-7 (5/7)తో ఓటమి చవిచూశాడు. తొలి సెట్ నెగ్గిన సనమ్ రెండో సెట్ టైబ్రేక్‌లో 6-2తో ఆధిక్యంలో ఉన్నాడు. అరుుతే సనమ్ వరుసగా ఆరు పారుుంట్లు కోల్పోరుు సెట్‌ను చేజార్చుకున్నాడు. నిర్ణాయక మూడో సెట్లోనూ సనమ్ టైబ్రేక్‌లో తడబడ్డాడు. -
సనమ్కు రజతం... జిజ్ఞాస్కు కాంస్యం
జంషెడ్పూర్: జాతీయ సీనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్లు సనమ్, జిజ్ఞాస్లు రజత, కాంస్య పతకాలు సాధించారు. జేఆర్డీ టాటా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో పురుషుల 50 మీటర్ల కాంపౌండ్ ఈవెంట్లో ఐ.ఆర్.సనమ్కు తృటిలో పసిడి పతకం చేజారింది. 701 పాయింట్లతో అతను రజతంతో సరిపెట్టుకోగా, వర్మ (702) పాయింటు తేడాతో పసిడి పతకం గెలిచాడు. ఇందులో జిజ్ఞాస్ (699) కాంస్యం నెగ్గాడు. ఈ పోటీల్లో జార్ఖండ్‌కు చెందిన స్టార్ ఆర్చర్ దీపిక కుమారి రెండు జాతీయ రికార్డులు నెలకొల్పింది. 70 మీటర్ల ఈవెంట్లో 333 పాయింట్లతో సరికొత్త రికార్డు నమోదు చేసింది. 60 మీటర్ల ఈవెంట్లో 346 పాయింట్లతో మరో జాతీయ రికార్డు నెలకొల్పింది.