సనమ్‌కు రజతం... జిజ్ఞాస్‌కు కాంస్యం | silver to sanam... bronze to Jijnas | Sakshi
Sakshi News home page

సనమ్‌కు రజతం... జిజ్ఞాస్‌కు కాంస్యం

Dec 24 2013 12:49 AM | Updated on Aug 18 2018 6:00 PM

జిజ్ఞాస్‌,సనమ్ - Sakshi

జిజ్ఞాస్‌,సనమ్

జాతీయ సీనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్లు సనమ్, జిజ్ఞాస్‌లు రజత, కాంస్య పతకాలు సాధించారు. జేఆర్‌డీ టాటా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో పురుషుల 50 మీటర్ల కాంపౌండ్ ఈవెంట్‌లో ఐ.ఆర్.సనమ్‌కు తృటిలో పసిడి పతకం చేజారింది

 జంషెడ్‌పూర్: జాతీయ సీనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్లు సనమ్, జిజ్ఞాస్‌లు రజత, కాంస్య పతకాలు సాధించారు.  జేఆర్‌డీ టాటా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో పురుషుల 50 మీటర్ల కాంపౌండ్ ఈవెంట్‌లో ఐ.ఆర్.సనమ్‌కు తృటిలో పసిడి పతకం చేజారింది. 701 పాయింట్లతో అతను రజతంతో సరిపెట్టుకోగా, వర్మ (702) పాయింటు తేడాతో పసిడి పతకం గెలిచాడు. ఇందులో జిజ్ఞాస్ (699) కాంస్యం నెగ్గాడు.

ఈ పోటీల్లో జార్ఖండ్‌కు చెందిన స్టార్ ఆర్చర్ దీపిక కుమారి రెండు జాతీయ రికార్డులు నెలకొల్పింది. 70 మీటర్ల ఈవెంట్‌లో 333 పాయింట్లతో సరికొత్త రికార్డు నమోదు చేసింది.  60 మీటర్ల ఈవెంట్‌లో 346 పాయింట్లతో మరో జాతీయ రికార్డు నెలకొల్పింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement