‘అనలాగ్ ఏఐ’ సీఈఓ కిప్‌మన్‌కు జ్ఞాపికను అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
అత్యంత నివాసయోగ్య నగరంగా తీర్చిదిద్దుతాం
ఎనిమిది వారాల పాటు పైలెట్ ప్రాజెక్టు అమలు
‘అనలాగ్ ఏఐ’ సీఈఓ కిప్‌మన్‌తో సీఎం రేవంత్ భేటీ
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యంత నివాసయోగ్య నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత మేర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గురువారం ఉదయం ‘అనలాగ్ ఏఐ’సీఈఓ అలెక్స్ కిప్‌మన్ సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ రద్దీ, నగర ప్రాంతాల్లో వరదలు, సరస్సుల రక్షణ, వాతావరణ అంచనా, పరిశ్రమల కాలుష్య నియంత్రణ తదితర అంశాల్లో అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికత, పరిష్కార మార్గాలపై చర్చించారు.
‘ఫిజికల్ ఇంటెలిజెన్స్’ఆధారంగా రియల్ టైమ్ సెన్సార్ నెట్‌వర్క్, స్మార్ట్ సిటీ నిర్వహణ పద్ధతులను అమలు చేసే వీలుందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ఎనిమిదివారాల పాటు ‘ఫిజికల్ ఇంటెలిజెన్స్’ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా అమలు చేయా లని నిర్ణయించారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా సీసీ టీవీ వ్యవస్థను ‘రియ ల్ టైమ్ సిటీ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్’గా మారుస్తారు. ట్రాఫిక్, ప్రజాభద్రత, అత్యవసర సేవలన్నీ ఏఐ ఆధారిత అంచనాలతో ఒకేచోట సమన్వయం చేస్తారు.
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ ప్రాజెక్టును ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. ఇది పూర్తయ్య–2047’లక్ష్యాలను వివరించారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి కూడా ‘ఫిజికల్ ఇంటెలిజెన్స్’అత్యుత్తమ పరిష్కారాలను అందిస్తుందని కిప్‌మన్ ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రావాల్సిందిగా కిప్‌మన్‌ను రేవంత్ ఆహ్వానించారు.


