యాదగిరిగుట్టలో ఈనెల 26 నుంచి 28 వరకు జరిగే ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్య, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని బరిగెల వెంకటేష్ పిలుపునిచ్చారు.
26 నుంచి ఏఐఎస్‌ఎఫ్ శిక్షణ తరగతులు
Jul 21 2016 1:23 AM | Updated on Sep 4 2017 5:29 AM
నల్లగొండ టౌన్ : యాదగిరిగుట్టలో ఈనెల 26 నుంచి 28 వరకు జరిగే ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్య, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని బరిగెల వెంకటేష్ పిలుపునిచ్చారు. బుధవారం శిక్షణ తరగతులకు సంబంధించిన కరపత్రాలను ఏఐఎస్‌ఎఫ్ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అవంలబిస్తున్న విద్యా, వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సయ్యద్ జమీర్, ఇ.వెంకటేష్, అశోక్, మందుల శేఖర్, మధు, లింగస్వామి, సుధాకర్, రాజీవ్, రవి పాల్గొన్నారు.
Advertisement
Advertisement