మాజీ సైనికుల సంక్షేమమే లక్ష్యం
మాజీ సైనికులు, వితంతువుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని ఎన్‌సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ పీజీ కృష్ణ చెప్పారు.
– ఎన్‌సీసీ కమాండర్ కల్నల్ పీజీ కృష్ణ
కర్నూలు(హాస్పిటల్): మాజీ సైనికులు, వితంతువుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని ఎన్‌సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ పీజీ కృష్ణ చెప్పారు. స్థానిక ఎన్‌సీసీ క్యాంటీన్‌లో వచ్చిన లాభాల నుంచి మరణించిన మాజీ సైనికుల భార్యలు, మాజీ సైనికులకు 15 మందికి రూ.10వేల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో క్యాంటీన్‌లో సరుకులు కొనుగోలు చేయాలంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉండాల్సి వచ్చేదన్నారు. దీన్ని సవరించి సెల్ఫ్ సర్వీసు విధానంలో త్వరగా సరుకులు తీసుకునే విధంగా మార్పులు చేశామన్నారు.
క్యాంటీన్‌లో సరుకులు కొనుగోలు చేసి డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేసే వారికి 2 శాతం పన్నును మినహాయింపును బ్యాంకర్లు ఇచ్చారన్నారు. వైద్య విధానంలో భాగంగా ఈసీహెచ్‌ఎస్ స్కీమ్ బాగా నడుస్తోందన్నారు. అనంతరం ఆయన సి. రాణెమ్మ, వై. ముర్తుజాబీ, బి. కృపమ్మ, షేక్ హసీనా, ఎస్. సత్య, ఇ. సరళ, ఎస్. యశోద, సత్యవతి, పఠాన్ అస్మత్‌ఖాతూన్, ఎల్లమ్మ, చిన్నమ్మ, ఎం. శివమ్మ, అన్నమ్మ, గోవిందమ్మ, నాగరాణిదేవిలకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో యుఆర్‌సీ∙ ఇన్‌చార్జి ఆఫీసర్ కల్నల్ ఐతల్, 9వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ ఎస్‌కె సింగ్, లెఫ్ట్‌నెంట్ కల్నల్ గౌస్‌బేగ్, ఈసీహెచ్ ఆఫీసర్ కల్నల్ సుబ్బయ్య, మాజీ సైనికోద్యోగుల సంఘం అధ్యక్షులు పురుషోత్తమ్, క్యాంటీన్ మేనేజర్ కేపీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.