ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేయాలని ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్రెడ్డి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలకు సూచించారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు : నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేయాలని ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్రెడ్డి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలకు సూచించారు. చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో సోమవారం నిర్వహించిన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు నిర్వహించిన గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంపై వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. పార్టీ నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిం చాలని సూచించారు. పార్టీ పటిష్టానికి గ్రామ, బూత్‌స్థాయిలో కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పథకం అమలు కోరుతూ ఈనెల 9న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టనున్న ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశానికి పార్టీ సీనియర్ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జిల్లా ఇన్చార్జి పిల్లి సుభాస్‌చంద్రబోస్, జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, సమన్వయకర్తలు కారుమూరి వెంకటనాగేశ్వరరావు, తెల్లం బాలరాజు, పుప్పాల వాసుబాబు కొఠారు రామచంద్రరావు, కవురు శ్రీనివాసు, తానేటి వనిత, తలారి వెంకట్రావు, మేకా శేషుబాబు, ఎస్.రాజీవ్‌కృష్ణ హాజరయ్యారు.