‘హోదా’ ఇచ్చే వరకూ పోరాటం | agitation on spl status | Sakshi
Sakshi News home page

‘హోదా’ ఇచ్చే వరకూ పోరాటం

Aug 6 2016 8:47 PM | Updated on Sep 4 2017 8:09 AM

భజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించే వరకు కేంద్రంపై ఉద్యమిస్తామని పలువురు సర్పంచులు స్పష్టం చేశారు. జిల్లా సర్పంచుల సంఘ సమావేశం సీతారామ్‌ నగర్‌ 2వ లైన్‌లోని కార్యాలయంలో శనివారం జరిగింది.

జిల్లా సర్పంచుల సంఘం తీర్మానం
 
గుంటూరు వెస్ట్‌ : విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించే వరకు కేంద్రంపై ఉద్యమిస్తామని పలువురు సర్పంచులు స్పష్టం చేశారు. జిల్లా సర్పంచుల సంఘ సమావేశం సీతారామ్‌ నగర్‌ 2వ లైన్‌లోని కార్యాలయంలో శనివారం జరిగింది. సంఘం జిల్లా అధ్యక్షుడు కాటూరి శ్రీనివాసరావు సమావేశానికి అధ్యక్షత వహించారు. మూడేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా పెదకాకాని సర్పంచ్‌ ఆళ్ల వీరరాఘవమ్మ కేక్‌ను కట్‌ చేశారు. అనంతరం సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. 14వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకే కేటాయించడం(బదిలీ చేయడం)పై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈఓపీఆర్‌డీలు ఇష్టానుసారం వ్యవహరించకుండా ప్రతి విషయాన్ని సర్పంచ్‌కు తెలియజేయాలని తీర్మానించారు.  

Advertisement
 
Advertisement
Advertisement