కృష్ణా పుష్కరాల నేపథ్యంలో అమరావతిలోని అమరేశ్వరాలయాన్ని శ్రీశైలానికి చెందిన అఘోరాలు బుధవారం దర్శించుకున్నారు.
అమరేశ్వరుని దర్శించిన అఘోరాలు
Aug 17 2016 8:12 PM | Updated on Sep 4 2017 9:41 AM
అమరావతి (పెదకూరపాడు) : కృష్ణా పుష్కరాల నేపథ్యంలో అమరావతిలోని అమరేశ్వరాలయాన్ని శ్రీశైలానికి చెందిన అఘోరాలు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారుల కమిటీ వారికి ఘన స్వాగతం పలికింది. అఘోరాలు ఆలయంలో మూడు ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించుకున్నారు. పుష్కరాల నేపథ్యంలో కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాల సందర్శనలో భాగంగా అఘోరాలు ఇక్కడికి వచ్చినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
Advertisement
Advertisement