వైఎస్సార్ జిల్లా బద్వేలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం దాడులకు దిగారు.
వైఎస్సార్ జిల్లా బద్వేలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం దాడులకు దిగారు. ఎనిమిది సభ్యుల ఏసీబీ బృందం కార్యాలయానికి చేరుకుని స్టాంప్ వెండర్లను కూడా లోపలికి రప్పించి గేట్లకు తాళాలు వేయించింది. లోపల రికార్డులు తనిఖీ చేయడంతోపాటు సిబ్బందిని, స్టాంప్ వెండర్లను విచారిస్తున్నారు.