ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్ | acb officials caught sub registrar | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్

Aug 27 2016 6:18 PM | Updated on Aug 17 2018 12:56 PM

భూమి రిజిస్ట్రేషన్ కోసం ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటున్న సబ్‌రిజిస్ట్రార్ శనివారం ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.

గుంటూరు: భూమి రిజిస్ట్రేషన్ కోసం ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటున్న సబ్‌రిజిస్ట్రార్ శనివారం ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. గుంటూరు జిల్లా పిట్లవానిపాలెం సబ్ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న లక్ష్మీనారాయణ భూమి రిజిస్ట్రేషన్ నిమిత్తం ఓ వ్యక్తిని రూ. 10 వేలు డిమాండ్ చేశాడు.

ఆ వ్యక్తి తాను అంత ఇచ్చుకోలేనని రూ.5 వేలు ఇస్తానని చెప్పి అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అదనపు సమాచారం కోసం విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement