ఆటో, బైక్‌ ఢీకొని వ్యక్తి మృతి | a person died in accident | Sakshi
Sakshi News home page

ఆటో, బైక్‌ ఢీకొని వ్యక్తి మృతి

Dec 26 2016 9:16 PM | Updated on Sep 28 2018 3:41 PM

ఆటో, బైక్‌ ఢీకొని వ్యక్తి మృతి - Sakshi

ఆటో, బైక్‌ ఢీకొని వ్యక్తి మృతి

ఈపూరు: ఆటో, బైకు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతిగా నలుగురు తీవ్రగాయాలు పాలయ్యారు.

 
  • నలుగురికి తీవ్రగాయాలు 
 
ఈపూరు:  ఆటో, బైకు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతిగా నలుగురు తీవ్రగాయాలు పాలయ్యారు.  ఈపూరు మండలం  కొండ్రముట్ల గ్రామ సమీపంలో సోమవారం జరిగిన ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు..  బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెం నుంచి వినుకొండకు వెళ్తున్న ఆటో, వినుకొండ నుంచి  గోపువారిపాలెం వెళ్తున్న ద్విచక్రవాహనం కొండ్రముట్ల గ్రామం వద్ద ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం నడుపుతున్న  ముక్కపాటి హనుమంతరావు (40)  అక్కడికక్కడే  మృతి చెందాడు. ప్రమాదంలో అతని కాలు  తెగిపోయి రోడ్డుపై పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న కొత్త యేహాను, పుష్ప, ఆటో డ్రైవరు కొమరిగిరి సురేష్, వెంకటకుమారి, ఆషాలకు తీవ్రగాయాలు కాగా వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు హనుమంతరావుకు భార్య, ఇరువురు సంతానం ఉన్నారు.  సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, 
 నరసరావుపేట  ఆర్డీవో జి.రవీందర్, డీఎస్పీ కె.నాగేశ్వరరావు, సీఐ శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజలు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, ప్రమాదాల నివారణకు తమ వంతు సహకారం అందించాలన్నారు.
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement