పే..ద్ద... పుట్టగొడుగు | A Huge mushroom | Sakshi
Sakshi News home page

పే..ద్ద... పుట్టగొడుగు

May 22 2016 2:43 AM | Updated on Sep 4 2017 12:37 AM

పే..ద్ద...  పుట్టగొడుగు

పే..ద్ద... పుట్టగొడుగు

విశాఖ జిల్లా పాడేరు మండలం వంతాడపల్లి పంచాయతీ కోట్లగరువు గ్రామంలో ఓ నర్సరీలో ఐదున్నర కిలోల పుట్టగొడుగు లభ్యమైంది.

పాడేరు రూరల్: విశాఖ జిల్లా పాడేరు మండలం వంతాడపల్లి పంచాయతీ కోట్లగరువు గ్రామంలో ఓ నర్సరీలో ఐదున్నర కిలోల పుట్టగొడుగు లభ్యమైంది. దండు కేశ సాయిరాజుకు గ్రామంలో గోధుమగడ్డి నర్సరీ ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు అందులో పుట్టగొడుగులు మొలకెత్తాయి.

శనివారం ఉదయం నర్సరీలో పనిచేస్తున్న వెంకటస్వామి అనే వ్యక్తి భారీ పుట్టగొడుగును శనివారం పాడేరుకు తీసుకొచ్చాడు. దాన్ని తూకం వేయగా ఐదున్నర కిలోలు ఉంది.  పాడేరు ప్రాంతీయ ఆస్పత్రి వైద్యులు దానిని పరీక్షించి కూరగా వండుకోవచ్చని చెప్పడంతో ఇంటికి తీసుకెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement