సాధికార సర్వే 90 శాతం పూర్తి | 90 percent complete the sadhikara servey | Sakshi
Sakshi News home page

సాధికార సర్వే 90 శాతం పూర్తి

Sep 7 2016 7:18 PM | Updated on Sep 4 2017 12:33 PM

సాధికార సర్వే 90 శాతం పూర్తి

సాధికార సర్వే 90 శాతం పూర్తి

కేఆర్‌ పురం (బుట్టాయగూడెం): జిల్లాలో ప్రజా సాధికారిక సర్వే 90 శాతం పూర్తయ్యిందని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు తెలిపారు.

కేఆర్‌ పురం (బుట్టాయగూడెం): జిల్లాలో ప్రజా సాధికారిక సర్వే 90 శాతం పూర్తయ్యిందని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు తెలిపారు. కేఆర్‌ పురం ఐటీడీఏలో బుధవారం సర్వేపై జంగారెడ్డిగూడెం డివిజన్‌లోని మండలాల తహసీల్దార్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేలేరుపాడు, కుక్కునూరు, బుట్టాయగూడెం, పోలవరం, కొయ్యలగూడెం, గోపాలపురం మండలాల్లోని కొన్ని గ్రామాల్లో సిగ్నల్‌ లేకపోవడం వల్ల 10 నుంచి 13 శాతం సర్వే మిగిలి ఉందన్నారు. దీనిని కూడా ఈనెల 13వ తేదీ సాయంత్రంలోపు పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నూరు శాతం సర్వే పూర్తిచేస్తామన్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్‌లో ఏ గ్రామాల్లో సిగ్నల్‌ అందడం లేదు, ఎన్ని గ్రామాల్లో, ఎంత మందికి సర్వే చేయాల్సి ఉందనే విషయాలపై నివేదిక తయారుచేయాలని అధికారులకు ఆదేశించామని చెప్పారు. ఐటీడీఏ పీవో ఎస్‌.షణ్మోహన్, ఆర్డీవో ఎస్‌.లవన్న, తహసీల్దార్లు పాల్గొన్నారు. 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement