అపార్ట్‌మెంట్ పై నుంచి పడి చిన్నారి మృతి | 8 years old girl dies in freak accident | Sakshi
Sakshi News home page

అపార్ట్‌మెంట్ పై నుంచి పడి చిన్నారి మృతి

Jul 10 2016 11:58 AM | Updated on Aug 18 2018 8:37 PM

అపార్ట్‌మెంట్ పై నుంచి పడి చిన్నారి మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వంపుగూడ వద్ద ఆదివారం చోటుచేసుకుంది.

రంగారెడ్డి : అపార్ట్‌మెంట్ పై నుంచి పడి చిన్నారి మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వంపుగూడ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక కల్పన అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్థు పై నుంచి పడి తులసి అనే ఎనిమిదేళ్ల చిన్నారి మృతిచెందింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తులసి ప్రమాదవశాత్తు జారిపడిందా.. లేక కావాలనే పై నుంచి దూకిందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement