చాక్లెట్ గొంతులో ఇరుక్కుని బాలుడి మృతి | 8 years old boy dies in freak accident | Sakshi
Sakshi News home page

చాక్లెట్ గొంతులో ఇరుక్కుని బాలుడి మృతి

Sep 11 2016 1:21 PM | Updated on Sep 4 2017 1:06 PM

చాక్లెట్ గొంతులో ఇరుక్కుని బాలుడు మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా సి.బెలగల్ మండలం కొండాపురంలో ఆదివారం చోటుచేసుకుంది.

సి.బెలగల్ (కర్నూలు) : చాక్లెట్ గొంతులో ఇరుక్కుని బాలుడు మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా సి.బెలగల్ మండలం కొండాపురంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రయ్య శెట్టి కుమారుడు వేణు(8) ఆదివారం చాక్లెట్ తింటున్న క్రమంలో అది గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో విషయం తల్లిదండ్రులకు తెలిపాడు.

వారు చాక్లెట్ తీయడానికి తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. ముక్కులో నుంచి రక్తం వస్తుండటంతో కర్నూలు ఆస్పత్రికి తరలించేందుకు యత్నిస్తుండగా.. మార్గమధ్యంలో మృతిచెందాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement