చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం | 5 years old child kidnapped in hyderabad | Sakshi
Sakshi News home page

చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం

Aug 15 2016 3:10 PM | Updated on Sep 4 2017 9:24 AM

నగరంలోని నల్లకుంట పరిధి అడిక్‌మెట్‌ లో కిడ్పాప్ కు గురైన చిన్నారి కథ సఖాంతమైంది.

హైదరాబాద్‌: నగరంలోని నల్లకుంట పరిధి అడిక్‌మెట్‌ లో కిడ్పాప్ కు గురైన చిన్నారి కథ సఖాంతమైంది. హర్షిత(5) అనే చిన్నారిని ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి ఉన్న ఓ మహిళ చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి సోమవారం ఉదయం అపహరించుకు వెళ్లింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానికంగా ఉండే సీసీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు గాలింపు చేపట్టారు. కాగా చెవి దిద్దులు తీసుకుని చిన్నారిని అంబర్ పేటలో  వదిలి నిందితురాలు పరారైంది. పాపను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చిన్నారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. నిందితురాలి కోసం గాలింపు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement