శ్రీరామ్ నిమ్మల, హర్షిత జోడీగా రూపొందిన చిత్రం ‘ఏంటో అంతా సరికొత్తగా’. రాజ్ బోను దర్శకత్వంలో రాము ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాము.ఎం నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులముందుకు రానుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ‘హిట్’ చిత్రాల ఫేమ్, డైరెక్టర్ శైలేష్ కొలను ఆవిష్కరించి, మాట్లాడుతూ–‘‘ఏంటో అంతా సరికొత్తగా’ టైటిల్ చాలా కొత్తగా, ఆకర్షణీయంగా ఉంది. పోస్టర్ చూడగానే ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది.
ప్రస్తుతం ప్రేక్షకులు కొత్త కంటెంట్, కొత్త కథలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ సినిమా కూడా అదే దిశలో మంచి ప్రయత్నంగా కనిపిస్తోంది. రాజ్ బోనుగారు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించడం చాలా ఆసక్తికరంగా ఉంది. రాముగారు ఈ సినిమా నిర్మించడం అభినందనీయం. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ చిత్రం తప్పకుండా విజయం సాధించాలి’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం రిషి.ఎం, కెమెరా: వేణు కొత్తకోట.


