కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి ప్రస్తుతం జై హనుమాన్ మూవీలో నటిస్తున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో అలరించనున్నారు. ప్రస్తుతం ఈ మూ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమా షూట్ లాంఛనంగా ప్రారంభమైంది. ఇప్పటికే రిలీజైన హనుమాన్ పోస్టర్ చూస్తే రిషబ్ శెట్టి లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.
అయితే తాజాగా రిషబ్ శెట్టి చేసిన ఓ పని వివాదానికి దారి తీసింది. ఆయన పని చేసిన కాంతార టీమ్ నటీనటులను ఇన్‌స్టాలో అన్ ఫాలో చేయడం కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రెండు రోజుల క్రితం హోంబలే ఫిల్మ్స్ ఖాతాను అన్ ఫాలో చేసిన రిషబ్.. హీరోయిన్ రుక్మిణి వసంత్‌తో పాటు రాజ్ .బి.శెట్టిని కూడా అన్ ఫాలో చేశాడు. దీంతో రిషబ్‌కు.. నిర్మాణ సంస్థతో ఏమైనా విభేదాలు వచ్చాయా అని డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే కేవలం హోంబలే ఫిల్మ్స్ సంస్థ అధినేత విజయ్ కిరగందూర్‌ను మాత్రం రిషబ్ ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారు.
ఈ వివాదం నేపథ్యంలో రిషబ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హోంబలే ఫిల్మ్స్ సంస్థ అధినేత విజయ్ కిరగందూర్‌ను కూడా అన్ ఫాలో చేసేశారు. తాను ఫోలో అవుతున్న ఇన్‌స్టా లిస్ట్‌లో ఉన్న అందరినీ అన్ ఫాలో చేసి క్లియర్ చేశారు. రిషబ్ ఇప్పుడు కేవలం మూడు ఖాతాలను మాత్రమే ఫాలో అవుతున్నారు.. అందులో ఒకటి తన భార్య ప్రగతి శెట్టి.. మరొకటి తన ప్రొడక్షన్ హౌస్‌తో పాటు రిషబ్ శెట్టి ఫౌండేషన్‌ను ఫాలో చేస్తున్నారు. ఈ చర్యతో రిషబ్ శెట్టి వ్యవహారం శాండల్‌వుడ్‌లో మరోసారి చర్చకు దారితీసింది. అయితే దీనిపై రిషబ్ శెట్టి గానీ.. హోంబలే ఫిల్మ్స్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అసలేం జరిగిందన్ననది తెలియాలంటే నిర్మాణ సంస్థ కానీ.. రిషబ్ శెట్టినో క్లారిటీ ఇవ్వాల్సిందే. కాగా.. కాంతార సినిమాతో కన్నడ హీరో రిషబ్ శెట్టికి గుర్తింపు దక్కిన సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: స్టార్ హీరోయిన్‌ను అన్‌ఫాలో చేసిన రిషబ్ శెట్టి)


