కెమికల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన లారీ.. | 4 injured in road accident | Sakshi
Sakshi News home page

కెమికల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన లారీ..

Apr 10 2016 11:01 AM | Updated on Apr 3 2019 7:53 PM

వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి ముందు వెళ్తున్న కెమికల్ ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.

రాజమండ్రి (తూర్పు గోదావరి జిల్లా) : వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి ముందు వెళ్తున్న కెమికల్ ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఎగిసిపడ్డ అగ్నికీలలు కెమికల్‌కు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో కెమికల్ లారీ పూర్తిగా కాలిపోయింది.

ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం కాటేరు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. గోదావరి పై నూతనంగా నిర్మించిన గామన్ వంతెనపై వెళ్తున్న కెమికల్ ట్యాంకర్‌ను లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు క్లీనర్లు గాయపడ్డారు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement