మూసీ వరద నీటిలో 350 గొర్రెలు గల్లంతయ్యాయి. నల్లగొండ జిల్లా కేతేపల్లికి చెందిన గొర్రెల కాపరులు వేసవిలో మేత కోసం మిర్యాలగూడ పరిసర ప్రాంతాలకు వెళ్లారు.
మిర్యాలగూడ రూరల్: మూసీ వరద నీటిలో 350 గొర్రెలు గల్లంతయ్యాయి. నల్లగొండ జిల్లా కేతేపల్లికి చెందిన గొర్రెల కాపరులు వేసవిలో మేత కోసం మిర్యాలగూడ పరిసర ప్రాంతాలకు వెళ్లారు. ఆదివారం రాత్రి మిర్యాలగూడ మండలం ముల్కల కాలువ గ్రామ పంచాయతీ సమీపంలో నదిలో బండరాళ్లపై గొర్రెలను నిలిపారు. ఉదయం వంట చేసుకునేందుకు నది ఒడ్డుకు రాగానే మూసీ పరివాహక ప్రాంతం పై భాగాన కురిసిన వర్షాలకు వచ్చిన భారీ వరదలో 1500 గొర్రెలు చిక్కుకున్నాయి. స్థానికులు గమనించి మూగజీవాలను కాపాడే ప్రయత్నం చేశారు. అందులో 1150 గొర్రెలను కాపాడగా 350 గొర్రెలు వరద ఉధృతికి నదిలో కొట్టుకుపోయాయి.