సామర్లకోట: యువకులు ఆర్మీలో చేరడానికి ఈనెల 30వ తేదీ నుంచి ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు ఎంపీడీఓ బి. నాగేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 30వ తేదీన కాకినాడ ఎన్‌ఎఫ్‌సీఎల్ రోడ్డులోని క్రీడా మైదానంలోను, 31న అమలాపురం టీటీడీసీలోను ఈ ర్యాలీలు జరుగుతాయన్నారు. సెప్టెంబర్ ఒకటవ తేదీన రాజమహేంద్రవరంలో ధవిళేశ్వరం రోడ్డులోని క్వాయర్ బోర్డులో ఎంపిక జరుగుతుందని చెప్పారు.
30 నుంచి ఆర్మీ ర్యాలీలు
Aug 28 2016 9:59 PM | Updated on Sep 4 2017 11:19 AM
సామర్లకోట: యువకులు ఆర్మీలో చేరడానికి ఈనెల 30వ తేదీ నుంచి ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు ఎంపీడీఓ బి. నాగేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 30వ తేదీన కాకినాడ ఎన్‌ఎఫ్‌సీఎల్ రోడ్డులోని క్రీడా మైదానంలోను, 31న అమలాపురం టీటీడీసీలోను ఈ ర్యాలీలు జరుగుతాయన్నారు. సెప్టెంబర్ ఒకటవ తేదీన రాజమహేంద్రవరంలో ధవిళేశ్వరం రోడ్డులోని క్వాయర్ బోర్డులో ఎంపిక జరుగుతుందని చెప్పారు. అభ్యర్థులు ఆయా తేదీల్లో సెంటర్లకు ఉదయం 9.30 గంటలకు హాజరు కావాలన్నారు. 166 మీటర్ల ఎత్తు, 76–81 మధ్య ఛాతీ, 50 కేజీల బరువు ఉన్న, 10వ తరగతి చదివిన వారు (21 ఏళ్లు), ఇంటర్ పూర్తి చేసిన వారు (23 ఏళ్లు) అర్హులని ఆయన తెలిపారు.
Advertisement
Advertisement