నీటిసంపులో పడి చిన్నారి దుర్మరణం | 3 years old girl drowns in water tank | Sakshi
Sakshi News home page

నీటిసంపులో పడి చిన్నారి దుర్మరణం

Jun 12 2016 5:44 PM | Updated on Sep 4 2017 2:20 AM

అప్పటి వరకూ ఇంటి ముందు ఆడుకున్న ఆ చిన్నారిని నీటి సంపు బలితీసుకుంది.

గరిడేపల్లి (నల్లగొండ) : అప్పటి వరకూ ఇంటి ముందు ఆడుకున్న ఆ చిన్నారిని నీటి సంపు బలితీసుకుంది. నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. తల్లిదండ్రులు ఇంట్లో ఉండగా సమీరా(3) అనే చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటూ ఉంది. చిన్నారి మాట వినిపించకపోవడంతో కొంతసేపటి తర్వాత తల్లిదండ్రులు బయటకు వచ్చి చూడగా పాప కనిపించలేదు. చుట్టూ వెతగ్గా నీటి సంపులో పడి మృతి చెంది కనిపించింది.

Advertisement
 
Advertisement
Advertisement