జిల్లాలో 3.78 కోట్ల మొక్కలు నాటాం | 3.78 croses plants in district | Sakshi
Sakshi News home page

జిల్లాలో 3.78 కోట్ల మొక్కలు నాటాం

Aug 23 2016 10:44 PM | Updated on Sep 4 2017 10:33 AM

మాట్లాడుతున్న కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌

మాట్లాడుతున్న కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌

హరితహారంలో భాగంగా జిల్లాలో 3.78 కోట్ల మొక్కలు నాటినట్లు కలెక్టర్‌ డీఎస్‌ లోకేష్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌ సాధారణ పరిపాలన కార్యాలయం నుంచి అటవీశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బీఆర్‌ మీనా హరితహారంపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

  • వీసీలో కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌
  • ఖమ్మం జెడ్పీసెంటర్‌: హరితహారంలో భాగంగా జిల్లాలో 3.78 కోట్ల మొక్కలు నాటినట్లు కలెక్టర్‌ డీఎస్‌ లోకేష్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌ సాధారణ పరిపాలన కార్యాలయం నుంచి అటవీశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బీఆర్‌ మీనా హరితహారంపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో 3.50 కోట్ల మొక్కలు హరితహారంలో నాటాలని లక్ష్యంగా నిర్ణయించామని, లక్ష్యాన్ని మించి అదనంగా 28 లక్షల మొక్కలను నాటినట్లు చెప్పారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకునేలా ఆదేశించినట్లు చెప్పారు. వారం రోజుల్లో జియోరిఫరెన్స్‌ పూర్తవుతుందన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ మీనా కలెక్టర్‌ను అభినందించారు. నిర్ధేశించిన లక్ష్యాన్ని మించి జిల్లాను ఆదర్శంగా నిలిపారన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో హరితహారం ప్రత్యేకాధికారి రఘవీర్, అటవీశాఖ అధికారి నర్సయ్య, ఎస్పీ సాయికృష్ణ, సామాజిక అటవీశాఖ అధికారి సతీష్, డీఎఫ్‌ఓ సునీల్‌ హెరాత్‌ తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement