ఎన్‌టీఆర్ భరోసా పథకం కింద జిల్లాకు 28వేల పింఛన్లు మంజూరయ్యాయి.
జిల్లాకు 28వేల కొత్త పింఛన్లు
Dec 28 2016 10:36 PM | Updated on Sep 4 2017 11:49 PM
కర్నూలు(హాస్పిటల్): ఎన్‌టీఆర్ భరోసా పథకం కింద జిల్లాకు 28వేల పింఛన్లు మంజూరయ్యాయి. వీటిని ఫిబ్రవరి నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 3,07,143 మందికి పింఛన్లు ఇస్తున్నారు. ఇందులో వృద్ధాప్య 1,21,192, వితంతు 1,24,773, వికలాంగులు 39,548, చేనేత 3,519, కల్లుగీత 159, అభయహస్తం 17,902 మందికి ఇస్తున్నారు. వీరు కాకుండా గతంలో జన్మభూమి సభల్లో అందజేసిన 37,720 మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో నియోజకవర్గానికి 2వేల చొప్పున మొత్తం 28వేల పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. లబ్ధిదారుల జాబితాను ఆయా మండలాల ఎంపీడీఓలు తయారు చేస్తున్నారు. ఎంపిక చేసిన వారి జాబితాను వచ్చే నెల రెండో తేదీ నుంచి ప్రారంభమయ్యే జన్మభూమి గ్రామసభ/వార్డు సభల్లో ప్రకటించే అవకాశం ఉంది. కొత్త పింఛన్లను లబ్ధిదారులకు ఫిబ్రవరి నుంచి పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Advertisement
Advertisement