2018లో అశ్వమేధ యాగం | 2018 aswamedha yaagam | Sakshi
Sakshi News home page

2018లో అశ్వమేధ యాగం

Aug 7 2016 12:27 AM | Updated on Sep 4 2017 8:09 AM

2018లో అశ్వమేధ యాగం

2018లో అశ్వమేధ యాగం

రాజమహేంద్రవరం కల్చరల్‌ : ఐదు లక్షల మంది భక్తులతో 2018 నవంబరులో రాజమహేంద్రవరంలో అశ్వమేధ యాగాన్ని నిర్వహించనున్నట్టు అఖిల్‌ విశ్వగాయత్రి పరివార్, శాంతికుంజ్, హరిద్వార్‌ ప్రతినిధి బ్రిజ్‌మోహన్‌ గౌడ్‌ తెలిపారు. శనివారం స్థానిక ఆనం రోటరీహాల్‌లో అఖిల విశ్వగాయత్రి పరివార్‌ నగర శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడేళ్లకోసారి అశ్వమేధ యాగా

రాజమహేంద్రవరం కల్చరల్‌ : ఐదు లక్షల మంది భక్తులతో 2018 నవంబరులో రాజమహేంద్రవరంలో అశ్వమేధ యాగాన్ని నిర్వహించనున్నట్టు అఖిల్‌ విశ్వగాయత్రి పరివార్, శాంతికుంజ్, హరిద్వార్‌ ప్రతినిధి బ్రిజ్‌మోహన్‌ గౌడ్‌ తెలిపారు. శనివారం స్థానిక ఆనం రోటరీహాల్‌లో అఖిల విశ్వగాయత్రి పరివార్‌ నగర శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడేళ్లకోసారి అశ్వమేధ యాగాన్ని నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు కన్యాకుమారి,హరిద్వార్‌లో నిర్వహించామని పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లడానికి ఈ యాగాన్ని నిర్వహిస్తున్నామని చె´పు. సమావేశంలో నగర కన్వీనర్‌ జగదీష్‌ వైష్ణవ్, దక్షిణ భారత కన్వీనర్‌ సుబ్బారావు, గాయత్రీ ప్రజ్ఞా పీఠాధిపతి ద్రాక్షారపు రాధాకృష్ణమూర్తి, సీతారామ్‌ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement