ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.
కావలి: ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం మద్దూరు పాడు సమీపంలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన కొందరు కారులో తిరుమల వెళ్తున్నారు. వారి వాహనం మద్దూరుపాడు సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న వెంకటసాయి, వెంకటేశ్వరరావు అనే ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. వారిని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.