విశాఖ నగరంలోని యలమంచిలి తులసీనగర్‌లో విషాదం చోటు చేసుకుంది.
యలమంచిలి: విశాఖ నగరంలోని యలమంచిలి తులసీనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. భవన నిర్మాణ పనుల్లో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతి చెందారు. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులైన బుద్ధా బాబునాయుడు, సత్యనారాయణ భూలోకమాంబ ఆలయం సమీపంలో నూతనంగా ఇల్లు నిర్మించుకుంటున్నారు. శుక్రవారం పనులు జరుగుతుండగా ఇనుపరాడ్లకు 11కేవీ విద్యుత్ తీగలు తగలడంతో షాక్ తగిలి బాబునాయుడు, సత్యనారాయణ అక్కడే ప్రాణాలు విడిచారు. మరో కార్మికుడికి తీవ్ర గాయలయ్యాయి. గాయపడిన కార్మికుడిని యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.