కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 16 నుంచి బీ ఫార్మసీ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.పురుషోత్తం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
16 నుంచి బీ ఫార్మసీ పరీక్షలు
Sep 9 2016 11:18 PM | Updated on Sep 4 2017 12:49 PM
కేయూక్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 16 నుంచి బీ ఫార్మసీ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.పురుషోత్తం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 16, 19, 21, 23, 26, 28 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రథమ సంవత్సరం పరీక్షలు, 17వ తేదీ నుంచి మూడో సంవత్సరం విద్యార్థులకు రెండో సెమిస్టర్ పరీక్షలు జ రుగుతాయని వివరించారు. థర్డ్ ఇయర్ వారికి 17న పేపర్–1 మెడిసినల్ కెమిస్ట్రీ–1 (నేచురల్ ప్రొడక్ట్), 20న పేపర్–2 ఫార్మాకాగ్నసీ, 22న థర్డ్‌పేపర్ ఫార్మకాలజీ, 24న పేపర్–4 ఫార్మస్యూటికల్ జూరిప్రుడెన్స్ పరీక్ష నిర్వహిస్తామని పే ర్కొన్నారు. మూడో సంవత్సరం వారికి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు జరుగుతాయన్నారు.
Advertisement


