ఏపీలో 15 మంది డీఎస్పీలు బదిలీ | 15 DSPs transferred in andhra pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో 15 మంది డీఎస్పీలు బదిలీ

Feb 12 2016 6:32 PM | Updated on May 25 2018 5:59 PM

ఆంధ్రప్రదేశ్లో15 మంది డీఎస్పీల బదిలీతోపాటు పదోన్నతులు కల్పిస్తూ డీజీపీ జె.వి.రాముడు శుక్రవారం విజయవాడలో ఉత్తర్వులు జారీ చేశారు.

విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో15 మంది డీఎస్పీల బదిలీతోపాటు పదోన్నతులు కల్పిస్తూ డీజీపీ జె.వి.రాముడు శుక్రవారం విజయవాడలో ఉత్తర్వులు జారీ చేశారు. గుంతకల్లు డీఆర్ఎస్పీగా పీఎన్ బాబు గుంటూరు డీఆర్ఎస్పీగా ఎల్ అజయ్ ప్రసాద్ను నియమించారు. అలాగే ఇంటెలిజెన్స్ డీఎస్పీగా ఎస్.రాఘవ, తిరుపతి నగర పశ్చిమ ఎస్డీపీవోగా టి.కనకరాజు, తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీగా దిలీప్ కిరణ్, హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్కు టి.మురళీ కృష్ణను రిపోర్ట్ చేశారు.

రాజంపేట ఎస్డీపీవోగా విజయ్భాస్కర్, డీఎస్పీ ఇంటెలిజెన్స్గా అరవింద్బాబు, విజయవాడ సెంట్రల్ ఏసీపీగా ఎన్. సత్యానందం బదిలీ చేశారు. అయితే ప్రస్తుతం గుంతకల్లు డీఆర్ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కె. మధును హైదరాబాద్ హెడ్క్వార్టర్స్కు బదిలీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement