పుష్కరాలకు 1150 బస్సులు | 1150 busess for pushkar | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు 1150 బస్సులు

Aug 9 2016 1:11 AM | Updated on Sep 4 2017 8:25 AM

పుష్కరాలకు 1150 బస్సులు

పుష్కరాలకు 1150 బస్సులు

దామరచర్ల: కృష్ణాపుష్కరాలకు రాష్ట్ర వ్యాప్తంగా 1150 ఆర్టీసీ బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఎండీ రమణారావు తెలిపారు.

దామరచర్ల: కృష్ణాపుష్కరాలకు రాష్ట్ర వ్యాప్తంగా 1150 ఆర్టీసీ బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఎండీ రమణారావు తెలిపారు. సోమవారం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లిలో బస్సు పార్కింగ్‌ స్థలాలను పరిశీలించారు. అనంతరం శ్రీమీనాక్షి అగస్త్యేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పుష్కరాలు జరిగే నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు 1150 బస్సులు నడుపుతామన్నారు. వీటిలో ఏసీ బస్సులు కూడా ఉంటాయన్నారు. భక్తుల డిమాండ్‌ను బట్టి అవసరమైతే బస్సుల సంఖ్యను పెంచుతామన్నారు. పార్కింగ్‌ ప్రాంతాలనుంచి ఉచితంగా షటిల్‌ బస్సులు నడిపేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎం కృష్ణహరి, మధుసూదన్‌రెడ్డి, వీవీఎన్‌రెడ్డి, సుధాకర్, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement