పెరిగిపోతున్న బాల యాచకులు | పెరిగిపోతున్న బాల యాచకులు | Sakshi
Sakshi News home page

పెరిగిపోతున్న బాల యాచకులు

Jul 31 2016 7:41 PM | Updated on Oct 16 2018 3:12 PM

పెరిగిపోతున్న బాల యాచకులు - Sakshi

పెరిగిపోతున్న బాల యాచకులు

బాల యాచకుల సంఖ్య మెదక్‌ పట్టణంలో రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతోంది.

పట్టించుకోని అధికారులు
మెదక్‌:
బాల యాచకుల సంఖ్య మెదక్‌ పట్టణంలో రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. అయినా అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కళ్లముందే బాలయాచకులు బడికి వెళ్లకుండా భిక్షాటన చేస్తున్నా పట్టించుకునే వారే లేరు. తల్లిదండ్రులకు సైతం ఆ పూట గడుస్తుండటంతో అదే గొప్ప అనుకుంటున్నారు.   మెదక్‌ పట్టణంలోని గాంధీనగర్, నర్షిఖేడ్‌, తదితర ప్రాంతాల్లో బాలయాచకుల సంఖ్య అధిక సంఖ్యలో ఉంది.  కాగా అధికారులు ఇప్పటికైనా స్పందించి   బడీడు పిల్లలైన బాలయాచకులను బడిలో చేర్పిస్తే  వారి భవిష్యత్తు బాగుపడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement