అంతర్జాతీయ రెండో యోగా దినోత్సవాన్ని అమెరికాలో గురువారం నుంచి జూన్ 25 వరకు వారం రోజుల పాటు భారత్ నిర్వహిస్తోంది.
షికాగో: అంతర్జాతీయ రెండో యోగా దినోత్సవాన్ని అమెరికాలో గురువారం నుంచి జూన్ 25 వరకు వారం రోజుల పాటు భారత్ నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాలను శాండ్‌విచ్ నగరంలో నిర్వహిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రారంభ వేడుకలకు శాండ్‌విచ్ నగర మేయర్ రిక్ ఊల్సన్, నగర ప్రముఖులు హాజరయ్యారు. నగర మేయర ఊల్సన్‌తో కలిసి భారత కౌన్సిల్ జనరల్ ఆసఫ్ సయూద్ మాట్లాడుతూ జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా యోగా డే నిర్వహిస్తున్నట్లు చెప్పారు.