యూఎస్ ఎన్నికల బరిలో ముగ్గురు ఎన్నారైలు | Three Indian-Americans join US Congressional race | Sakshi
Sakshi News home page

యూఎస్ ఎన్నికల బరిలో ముగ్గురు ఎన్నారైలు

Apr 24 2014 11:37 AM | Updated on Aug 24 2018 6:25 PM

యూఎస్ చట్టసభలకు నవంబర్లో ఎన్నికలు జరగునున్నాయి. ఆ చట్ట సభలలో సభ్యులుగా అడుగు పెట్టేందుకు ముగ్గురు భారతీయ అమెరికన్లు సమాయత్తమవుతున్నారు

యూఎస్ చట్టసభలకు నవంబర్లో ఎన్నికలు జరగునున్నాయి. ఆ చట్ట సభలలో సభ్యులుగా అడుగు పెట్టేందుకు  ముగ్గురు భారతీయ అమెరికన్లు సమాయత్తమవుతున్నారు. వియత్నాం యుద్ధంలో పోరాడిన యోధుడు రాజీవ్ పటేల్ ఉత్తర కరోలినా నుంచి డెమెక్రటిక్ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. 1968లో వియత్నంలో పొరాడిన పటేల్ అనంతరం నార్త్ కరోలినాలోని ఈస్ట్ స్పెన్సర్ నగరానికి మేయర్గా ఎన్నికయ్యారు.

 

అలాగే మరో భారతీయుడు అనిల్ కుమార్ స్వతహాగా వైద్యుడు. ఆయన మిచిగాన్ ప్రతినిధుల సభ నుంచి పోటీ చేయనున్నారు. ముచ్చటగా మూడో అభ్యర్థి సతీష్ కోర్పి ఇంజనీరింగ్ చదివి వ్యాపారవేత్తగానే కాకుండా మంచి భారతీయ సంతతికి చెందిన నాయకుడిగా ప్రఖ్యాతి గాంచారు. వర్జీనియా నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు. వీరే కాకుండా పలువురు భారతీయ అమెరికన్లు ఇప్పటికే యూస్ చట్టసభల రేసులో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement