వాషింగ్టన్లో క్యాట్స్ నేతృత్వంలో పేదలకు భోజనాలు | NRIs cook and serve food for poor in Washington DC by CATS | Sakshi
Sakshi News home page

వాషింగ్టన్లో క్యాట్స్ నేతృత్వంలో పేదలకు భోజనాలు

Aug 26 2013 7:05 PM | Updated on Jul 6 2019 12:42 PM

వాషింగ్టన్లో క్యాట్స్ నేతృత్వంలో పేదలకు భోజనాలు - Sakshi

వాషింగ్టన్లో క్యాట్స్ నేతృత్వంలో పేదలకు భోజనాలు

అమెరికా రాజధాని ప్రాంత తెలుగు సంఘం (క్యాట్స్) నేతృత్వంలో సంఘసేవా కార్యక్రమంలో భాగంగా వాషింగ్టన్ డీసీలో ఉన్న ఐదువేల మంది పేదవారికి భోజనాలు వండిపెట్టారు.

అమెరికా రాజధాని  ప్రాంత తెలుగు సంఘం (క్యాట్స్) నేతృత్వంలో సంఘసేవా కార్యక్రమంలో భాగంగా వాషింగ్టన్ డీసీలో ఉన్న ఐదువేల మంది పేదవారికి భోజనాలు వండిపెట్టారు. క్యాట్స్ సంస్థ వాషింగ్టన్ పరిసర ప్రాంతాల్లో తెలుగు సంస్కృతిని ప్రోత్సహిస్తూ ,  సంఘసేవా కార్యక్రమాలు కూడా చేపడుతుంది.
 
గత  తొమ్మిదేళ్లుగా తెలుగు పాఠశాల నిర్వహణ, తెలుగు పండుగల వేడుకలు, వేసవిలో "తెలుగు పిల్లలకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇంకా, తాము నివసిస్తున్న వాషింగ్టన్ పరిసర ప్రాంతాలలో, పేదవారికి సేవ చేయాలని ఉద్దేశంతో , ప్రతి ఏటా "వాషింగ్టన్ డిసి కిచెన్లో" నిర్వహించే "ఫుడ్ ఫర్ నీడీ" కార్యక్రమంలో అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొని పేదవారి కోసం స్వయంగా వండి వడ్డిస్తుంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఐదువేల మంది పేదలకు భోజనాలు వండి వడ్డించి పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement