సింగపూర్లో ఎన్నారైకు జైలు శిక్ష | Indian jailed for 9 months for molestation in Singapore | Sakshi
Sakshi News home page

సింగపూర్లో ఎన్నారైకు జైలు శిక్ష

Dec 19 2014 8:58 AM | Updated on May 29 2019 3:19 PM

సింగపూర్లో ఎన్నారైకు జైలు శిక్ష - Sakshi

సింగపూర్లో ఎన్నారైకు జైలు శిక్ష

మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఎన్నారై సత్తయ్య ఇళయరాజాకు సింగపూర్ కోర్టు 9 నెలల జైలు శిక్ష విధించింది.

సింగపూర్: మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఎన్నారై సత్తయ్య ఇళయరాజాకు సింగపూర్ కోర్టు 9 నెలల జైలు శిక్ష విధించింది. ఈ ఏడాది నవంబర్ 7వ తేదీన అపార్ట్మెంట్లోని లిఫ్ట్లో తనతో ప్రయాణిస్తున్న మహిళ పట్ల సత్తయ్య అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో ఆమె ప్రతిఘటించింది. మళ్లీ ఆమెపై అసభ్యంగా ప్రవర్తించబో తరుణంలో ఆమె లిఫ్ట్లో నుంచి బయటకు వచ్చి... పోలీసులకు ఆశ్రయించింది.  పోలీసులు సత్తయ్యను అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.

ఆ కేసులో నిందితుడికి కోర్టు రిమాండ్ విధించింది.  ఈ కేసు వాదోపవాదాలు విన్న కోర్టులో గురువారం తుది తీర్పు వెలువరించింది.  నిందితుడు సత్తయ్య ఇళయరాజాకు 9 నెలల జైలు శిక్ష ఖరారు చేస్తూ సింగపూర్ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ మేరకు శుక్రవారం స్ట్రెయిట్స్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది.

Advertisement
 
Advertisement
Advertisement