సెయింట్ లూయిస్లో వైఎస్ఆర్ 7వ వర్థంతి | Dr.YS Rajasekhara Reddy 7th Vardhanthi was celebrated in US St.Louis | Sakshi
Sakshi News home page

సెయింట్ లూయిస్లో వైఎస్ఆర్ 7వ వర్థంతి

Sep 12 2016 6:05 PM | Updated on Jul 7 2018 2:52 PM

సెయింట్ లూయిస్లో వైఎస్ఆర్ 7వ వర్థంతి - Sakshi

సెయింట్ లూయిస్లో వైఎస్ఆర్ 7వ వర్థంతి

మహానేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఏడవ వర్థంతి కార్యక్రమాన్ని అమెరికాలోని సెయింట్ లూయిస్లో ఘనంగా నిర్వహించారు.

సెయింట్ లూయిస్: మహానేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఏడవ వర్థంతి కార్యక్రమాన్ని అమెరికాలోని సెయింట్ లూయీస్లో ఘనంగా నిర్వహించారు. శనివారం మయూరీ రెస్టారెంట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ యూఎస్ఏ కన్వినర్ రత్నాకర్ వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. వైఎస్ఆర్ సేవలను గుర్తుచేసుకున్నారు.
 
ఆరోగ్య శ్రీ, జలయజ్ఞం, ఉచిత విద్యుత్ లాంటి పథకాలతో పేదలు, రైతులకు వైఎస్ఆర్ అందించిన సేవలను ఈ కార్యక్రమంలో కొనియాడారు. మహానేత ఆశించిన విధంగా రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ సెంయింట్ లూయిస్ కన్వినర్ శేఖర్ రెడ్డి దండు, భార్గవ రెడ్డి, అశోక్ రెడ్డి, సురేష్ రెడ్డి, అజయ్ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement